మామిడి 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటో తెలుసా?

మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. వేసవిలో మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఈ పండును ఎందుకు తినాలి అనే 7 ప్రధాన ఆరోగ్యకరమైన కారణాల గురించి తెలుసుకుందాము.

webdunia

మామిడిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి మన శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మామిడి పండ్లలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ ఉన్నాయి, ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మరంధ్రాలు క్లియర్ అవుతాయి, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి.

మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

రోగనిరోధక శక్తిని పెంచే అవసరమైన విటమిన్లు మామిడికాయల్లో వుంటాయి.

ఒక గ్లాసు మామిడి రసం వేసవిలో హీట్ స్ట్రోక్‌ను దూరం చేస్తుంది.

ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించాలి.