వింటర్ టిప్స్, శీతాకాలంలో జాగ్రత్తలు

వర్షాకాలం నుంచి శీతాకాలంలోకి మారుతున్నప్పుడు వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల సీజనల్ వ్యాధులు తలెత్తే అవకాశం వుంటుంది. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

శీతాకాలంలో తాజాకూరలు, ఉసిరి, బొప్పాయి, అనాస, ఖర్జూరా పండ్లను తీసుకోవాలి.

చలికాలంలో మంచుతీవ్రత ఉదయం ఎక్కువగా వుంటుంది కనుక వ్యాయామం ఉదయం 7 గంటల తర్వాత చేయాలి.

ద్విచక్రవాహనాలను నడిపేవారు మాస్కు ధరించడమే కాకుండా హెల్మెట్ ధరించాలి.

పొడిచర్మం వున్నవారికి చర్మ పగిలి మంటపుడుతుంది కనుక అలాంటివారు కోల్డ్ క్రీములను రాసుకోవాలి.

స్నానానికి గోరువెచ్చని నీళ్లను ఉపయోగించాలి. స్నానానికి వాడే సోప్స్ కూడా చెక్ చేసుకోవాలి.

కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.