ఆరోగ్యానికి కర్పూరం చేసే మేలు ఏమిటో తెలుసా?

కర్పూరం. దీనిని ఎక్కువగా పూజాది కార్యక్రమాలలో వాడుతుంటారు. ఐతే ఈ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమయినవి తెలుసుకుందాము.

webdunia

స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.

అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి ఇది బాగా పనిచేస్తుంది.

పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.

నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్‌గా దీనిని ఉపయోగిస్తారు.

చర్మం పైపూతగా పూసే లేపనములలోను, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలో వాడుతారు.

కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.

కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.

కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు నిపుణులను సంప్రదించాలి.