కుప్పింట చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
కుప్పింట చెట్టు. ఈ చెట్టు ఖాళీ ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. ఈ చెట్టు రెండు రకాలుగా వుంటాయి. ఒకదాని ఆకులు గుండ్రముగా ఉంటే రెండో చెట్టు ఆకులు చివర కోణం కలిగి ఉంటాయి. కుప్పింట చెట్టుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
కుప్పింట ఆకులు 9, మిరియాలు 9, కొంచెం హారతికర్పూరం కలిపి నూరి శనగ గింజంత మాత్రలు చేసి ఉదయం, సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉంటే కామెర్లు తగ్గుతాయి.
కుప్పింట ఆకు, వేరు కలిపి కషాయంలా చేసుకుని తాగినా లేక చూర్ణం తీసుకున్నా మొలలు బాధ నివారణ అవుతుంది.
ఈ చెట్టు ఆకుల పసరు చర్మరోగాలున్నవారి చర్మంపై లేపనం చేస్తే సమస్య నయం అవుతుంది.
కుప్పింట చెట్టు వేరుతో పళ్లు తోముకుంటే దంతరోగాలు తగ్గుతాయి.
కుప్పింట ఆకుల రసం ఒక టీ స్పూన్ తీసుకుంటే బ్రాంకైటిస్ వల్ల వచ్చే దగ్గు నివారణ అవుతుంది.
తేలు, జెర్రి, కందిరీగ, తేనెటీగ కుట్టిన వెంటనే ఈ ఆకు వేసి కట్టు కడితే ఉపశమనం కలుగుతుంది.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.