ఆయుర్వేదం ప్రకారం ఈ 5 పదార్థాలతో చేసినవి తింటే?

ఆయుర్వేదం ప్రకారం గోధుమ, బియ్యం, మినప, పెసర వంటి పదార్థాలతో వంటకాలు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

పాలను సగం వరకు మిగిలేటట్టుకాచి దానిలో ఎనిమిదోవంతు బియ్యాన్ని వేసి ఉడికించిన మిశ్రమాన్ని పరమాన్నం, పాయసం అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పురుషులకు చాలా మేలు చేస్తుంది.

గోధుమలతో చేసిన పాయసం మంచి బలాన్ని కలిగిస్తుంది. మేధస్సును వృద్ధిచేస్తుంది. వాత, పైత్యరోగాలను తగ్గిస్తుంది.

గోధుమ పిండిని ఒక వంతు, దానికి ఎనిమిదివంతుల శెనగపిండి, కొంచెం వాము, ఇంగువ, ఉప్పు, నెయ్యి కలిపి బాగా మర్ధించి, దాన్ని చిన్నచిన్న అప్పచ్చలుగా చేసి, పొగలేని నిప్పుల మీద ఎర్రగా కాల్చాలి. వీటిని తింటే మంచి బలం కలుగుతుంది.

మినపపిండిని తీసుకుని అందులో మిరియాలు, ఇంగువ, అల్లం బాగా కలిపి నేతిలోగానీ, నూనెలో గానీ వేయించి దానిని తింటే వాత వ్యాధులను తగ్గించి, ఆకలిని వృద్ధిచేస్తుంది.

పెసరపప్పుతో చేసిన వడియాలు మంచి పుష్టికరమైన ఆహారం. రక్తపిత్తం, వాతాన్ని తగ్గిస్తాయి. ఇవి దాహాన్ని అధికం చేస్తాయి.

అల్లం లేదా పాలతో బెల్లం కలిపి సేవిస్తుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది, ఎముకలు గట్టిపడుతాయి.