పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

సీతాఫలం. ఈ పండ్లలో విటమిన్లు, లవణాలు అధికంగా ఉంటాయి. సీతాఫలం మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో నోరూరిస్తుంది. ఎన్నో పోషక విలువలను శరీరానికి అందించే సీతాఫలం గురించి తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఈ పండు తినేవారిలో కండరాలు బలోపేతమై బలహీనత, సాధారణ అలసట దూరమవుతాయి.

వాంతులు, తలనొప్పి, చర్మ వ్యాధుల నివారణకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.

సీతాఫలం ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది.

ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది.

శరీరంలో వుండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.

ఆస్తమా ఉన్నవారు, మధుమేహం వున్నవారు సీతాఫలంను తీసుకోకూడదు.

లివర్‌ వ్యాధి, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు సీతాఫలానికి దూరంగా ఉండాలి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.