బాదం పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బాదం పాలు. మధుమేహం ఉన్నవారికి బాదం, బాదం పాలు మంచి ఎంపికలు. బాదం గింజలు తింటుంటే రక్తంలో చక్కెర నియంత్రణ, మెరుగైన బరువు నిర్వహణ, మెరుగైన గుండె ఆరోగ్యంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బాదం పాలు రక్తంలో చక్కెరను పెంచవు కనుక మధుమేహం వున్నవారు తీసుకోవచ్చు.

బాదం పాలలో కొలెస్ట్రాల్ ఉండదు, కేలరీలు తక్కువగా ఉంటాయి.

బాదం పాలతో కండరాలు బలోపేతం అవుతాయి.

బాదం పాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని బాదం పాలు తగ్గిస్తాయి.

బాదం పాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.

బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా వుంటుంది కనుక రక్తపోటును తగ్గిస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.