బట్టతలకు గురివిందాకు రసం పూస్తే?

గురివింద మాట వినేవుంటారు. ఈ గురివిందలు రకరకాలుగా వుంటాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. గురివింద చెట్టుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

గురివింద దురదలను, చర్మరోగాలను, వ్రణాలు, క్రిమిరోగాలు తగ్గిస్తుంది.

బట్టతలకు గురివిందాకు రసం పూస్తుంటే వెంట్రుకలు క్రమంగా తిరిగి మొలుస్తాయి.

కుంకుడుకాయరసంతో గురివిందలను అరగదీసి ఆ రసాన్ని కణతలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.

గురివిందలను తేనెతో మెత్తగా నూరి పేరు కొరికిన చోట రుద్దుతుంటే సమస్య తగ్గుతుంది, వెంట్రుకలు మొలుస్తాయి.

గురువింద గింజలు, కందదుంప రెండింటినీ సమంగా తీసుకుని కాస్త నీళ్లతో మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొలలపై రాస్తుంటే తగ్గుముఖం పడుతాయి.

దగ్గు ఇబ్బంది పెడుతుంటే గురివింద గింజల ఆకుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది.

గమనిక: గురివిందలు విషతుల్యమైనవి కనుక వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి.