కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది.

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది.

ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది.

శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.

క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.

ఆరోగ్యకరమైన కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి