నేరేడు గింజలు పొడి, నేరేడు ఆకుల కషాయం తీసుకుంటే ఏంటి ఫలితం?

నేరేడు చెట్టు ఆకులు, నేరేడు పండ్లు తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. నేరేడు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని చక్కెర శాతాన్న తగ్గించుకోవచ్చు.

నేరేడు గింజల పొడి తీసుకుంటే అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నేరేడులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

నేరేడు పండు రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా రక్తంలో కేన్సర్ కారకాలు వృద్ది చెందకుండా నిరోదిస్తుంది.

నేరేడులో ఉండే ఐరన్, విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.

నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నేరేడు నివారిస్తుంది.

ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే గుణం నేరేడుకి వుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.