అలోవెరా రసంలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.

కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది.

శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి.

జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి

యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్‌లో ఉంది.

శరీర పరిస్థితులకు చికిత్స చేయడంలో, చర్మ రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దంతాలతో పాటు నోటి ఆరోగ్యాన్ని కలబంద కాపాడుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.