ప్రకృతి ప్రసాదించిన పండ్లలో జామపండ్లు కూడా ఒకటి. పేదవాడి యాపిల్‌గా జామపండును చెబుతుంటారు. అలాంటి జామ చెట్టు ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా, జామ ఆకుల కషాయంతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
webdunia
నీటిలో జామ ఆకులతో పాటు అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం బాగా మరగించాలి.
జామ ఆకుల శూర్ణం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి.
జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
జామ ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే దగ్గు మటుమాయమవుతుంది.
జామ ఆకు టీలో బెల్లం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
జామ ఆకుల పొడిని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
గమనిక : ఏదైనా నివారణకు చిట్కాలు పాటించే ముందు, దయచేసి వైద్యుడిని సంప్రదించండి.