అలాంటి సమస్యలు వున్నవారు శనగలు తినాలి

మాంసాహారంలో వుండే ప్రోటీన్లన్నీ శనగలలో వున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ శనగలు తింటుంటే ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

శనగలను వారానికోసారి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

శనగల్లో పీచు ఎక్కువగా వుండటం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు శనగలు తింటే మేలు కలుగుతుంది.

శనగలులో వున్న మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి బీపీని నియంత్రిస్తాయి.

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శనగలు తోడ్పడుతాయి.

శనగలులో వున్న యాంటీ-ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

శనగల్లో వుండే సెరొటోనిన్, అమివో యాసిడ్లు హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.