కలబందతో సౌందర్యం, ఎలాగంటే?

కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కలబంద లేదా అలోవెరాను ఎక్కువగా సౌందర్య సాధనంగా వాడుతుంటారు. ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము.

credit: social media

కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటాకెరొటిన్ అధికంగా ఉంటాయి.

ఇవి చర్మంపై ఉన్న ముడతలను, మొటిమలు వంటి సమస్యలను నివారించి చర్మాన్ని ఆరోగ్యంగా, ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

కలబంద గుజ్జులో కాస్త బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి కొద్దిసేపాగాక కడిగిస్తే వృద్దాప్య ఛాయలను నివారించి యవ్వనంగా కనపడేలా చేస్తుంది.

కలబంద గుజ్జు, బియ్యపు పిండి కలిపిన పేస్టు వారానికి రెండుసార్లు మర్దిస్తే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించుకోవచ్చు.

రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జును రాసుకుంటే అది చర్మంలోని మృత కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

టమాటో- నిమ్మరసం- అలోవెరా గుజ్జు చర్మకాంతిని సహజంగా పెంచి, చర్మంలోని మృత కణాలను తొలగిస్తాయి.

కలబంద చర్మంపై ఉన్న జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.