మజ్జిగలో కాకర ఆకుల రసం కలుపుకుని తాగితే ఏమవుతుంది?

కాకర కాయ. చేదుగా వుండే ఈ కాకర కాయల్లో ఔషధ గుణాలు మెండుగా వున్నాయి. కాకర రసం, కాకర కాయలను తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

కాకర కాయలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా వుంటుంది.

కాలేయాన్ని శుభ్రపరచడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ తోడ్పడుతుంది.

రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ర్పభావాలను కాకర కాయ నివారిస్తుంది.

మూడు టీ స్పూన్ల కాకర ఆకుల రసాన్ని, ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడపున తాగితే పైల్స్ సమస్య తగ్గిపోతుంది.

కాకర చెట్టు వేర్లను పేస్టులా చేసి పైల్స్ వున్నచోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకర రసం బాగా ఉపకరిస్తుంది.

కాకరకాయలో జీర్ణవ్యవస్థను కాపాడే ఔషధ గుణాలున్నాయి.

కడుపులోని ఏలిక పాములు పోవాలంటే కాకర గింజల చూర్ణం నీటితో, తేనెతో కలిపి తీసుకోవాలి.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.