శీతాకాలంలో అల్లం పాలు తాగితే ఈ అనారోగ్యాలన్నీ పరార్

శీతాకాలం వచ్చిందంటే పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వీటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. వీటిని నిరోధించాలంటే అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

అల్లం పాలు గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

అల్లం జీర్ణక్రియకు సహాయపడటమే కాక వికారం తగ్గిస్తుంది. కీమోథెరపీ-ప్రేరిత వికారం తగ్గించడానికి అల్లం సమర్థవంతమైనది.

అల్లం యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది కనుక రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పాలలోని వెచ్చదనం, దాల్చినచెక్కలోని ప్రశాంతత గుణాలు శరీరానికి విశ్రాంతినిస్తాయి, అల్లం ఒత్తిడి- టెన్షన్‌ని తగ్గిస్తుంది.

పాలలో దాల్చినచెక్క, అల్లం కలిపి తాగుతుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోయి రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తుంది.

దాల్చినచెక్క, అల్లం రెండూ జీవక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.