చింతాకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆయుర్వేద మందుల తయారీలో చింతాకులను వినియోగిస్తారు. అనేక నాటు మందుల తయారీలోనూ చింత ఇగురు లేదా చింతాకును ఉపయోగిస్తారు. ఈ చింతాకుల రసంతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి చింతాకు వల్ల కలిగే ప్రయోజనమేంటో ఓ సారి తెలుసుకుందాం.

instagram

చింతాకుల ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది. తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది.

చింతాకుల మిశ్రమం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

చింతాకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు.

చింతాకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది.

చింతాకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది.

పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది.

గమనిక : ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.