హిమోగ్లోబిన్ పెంచే రసాలు ఏమిటో తెలుసా?

హిమోగ్లోబిన్. శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ లేనట్లయితే రక్త హీనత సమస్యతో బాధపడుతారు. ఐతే సరైన ఆహార పదార్థాలు తీసుకుంటుంటే శరీరానికి అవసరమైన రక్తం పడుతుంది. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

ఉసిరి, ద్రాక్ష పండ్ల రసాలను తాగుతుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

శరీరంలో ఐరన్‌ను పెంచే హెల్తీ డ్రింక్స్ లో బీట్ రూట్ ఒకటి. దీన్ని తీసుకుంటే రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

తేనె తీసుకునేవారిలో రక్త హీనత సమస్య తలెత్తే అవకాశం వుండదు.

నిమ్మకాయ రసం కూాడా రక్తవృద్ధికి మేలు చేస్తుంది.

దానిమ్మ రసం తాగుతు వుంటే హిమోగ్లోబిన్ కొరత లేకుండా చేయగలుగుతుందని నిపుణులు చెపుతారు.

పుచ్చకాయ రసం తాగితే రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.