ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢం(ఫిట్)గా ఉండాలనుకుంటారు. ఇందుకు వ్యాయామాలతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. కండరాలు, ఎముకల గట్టితనం ఉండాలంటే.. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి...
Social Media
మాంసాహారం తినటం వల్ల కండరాల్లో బలం వస్తుంది. వీటితో పాటు ప్రతి రోజూ ఒక కోడిగుడ్డును తింటే మజిల్ పవర్ పెరుగుతుంది.
పాల ఉత్పత్తులు ఏవి తీసుకున్నా కండబలం పెరుగుతుంది. కూరల్లో ఎక్కువగా బీన్స్ తినాలి.
సాల్మన్ లాంటి చేపలను తింటే కండరాల పుష్టి కలుగుతుంది.
ఎముకలు గట్టిపడాలంటే కాల్షియంతో పాటు విటమి-డి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
బాదం, జీడిపప్పు, పిస్తాలను తీసుకున్నా కాల్షియం, డి-విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఎముకలకు బలాన్నిస్తుంది.
విటమిన్ సి, పాస్ఫరస్ ఉండే ఆరటిపండ్లు తింటే తక్షణమే శక్తి వస్తుంది.