వేసవిలో మిమ్మల్ని చల్లగా వుంచే ఫుడ్ ఐటెమ్స్

వేసవి ఎండలు ముదిరిపోయాయి. విపరీతమైన సెగలు కక్కుతున్నాయి. ఈ వాతావరణంలో శరీరాన్ని చల్లగా వుంచుతూ ఆరోగ్యంగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆహార పదార్థాలను తింటుండాలి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

కీరదోస, దోసకాయలు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి, శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.

శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిన పుచ్చకాయలు వేసవిలో గొప్ప ఆహారంగా చెప్పబడింది.

ఆకు కూరల్లో పోషక విలువలు, కాల్షియం అధికంగా ఉంటాయి, శరీరానికి మంచి శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తాయి.

మజ్జిగలో కాస్త వేయించిన జీలకర్ర, తాజా కొత్తిమీర, కొన్ని అల్లం ముక్కలు కలిపి తాగండి.

శరీర వేడిని తగ్గించడానికి మామిడి పండ్లు కూడా ఉత్తమ ప్రత్యామ్నాయం.

నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

విటమిన్ బి, జీర్ణ సమస్యలను దూరం చేసే పెరుగు శరీరానికి చల్లదనాన్నిస్తుంది.

అవోకాడో మోనో-సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటుంది, ఇది రక్తం నుండి వేడి, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతుంది.

కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్‌లతో సమృద్ధిగా ఉండే పవర్ డ్రింక్, వేసవిలో రోజంతా హైడ్రేటెడ్, ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

పుదీనా కూలింగ్ హెర్బ్ కనుక పుదీనా నీరు తాగుతుండాలి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.