చాణక్య నీతి, జీవితంలో పురోగతి కోసం ఈ ప్రదేశాలు వదిలేయాలి

జీవితంలో పురోగతి సాధించాలంటే కొన్ని ప్రదేశాలలో ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. అవి ఎలాంటి ప్రదేశాలో తెలుసుకుందాము.

credit: social media and webdunia

మీరు నివసించే ప్రదేశంలో మీకు గౌరవం లేకపోతే, మీరు అక్కడ నివశించకూడదు.

మీ ఇంటికి సమీపంలో బంధువులు ఎవరూ లేకుంటే ఆ స్థలం నుండి వెళ్లిపోండి.

మీరు నివశించే చోట ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు లేకపోతే, మీరు అక్కడ వుండకూడదు.

మీరు నివశించే చోట విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే, అక్కడ జీవించడం పనికిరానిది.

పాఠశాల విద్య తప్ప నేర్చుకోదగినది ఏదీ లేని ప్రదేశాన్ని, ఆ స్థానాన్ని కూడా వదిలేయాలి.

పరిశుభ్రత లేని, కాలుష్యం వల్ల పర్యావరణం చెడిపోయిన చోట నివశించకూడదు.

చెడు సహవాసం ఉన్న వ్యక్తులు నివశించే స్థలాన్ని వెంటనే వదిలివేయాలి.

మీరు నివశించే చోట నీరు లేదా నిత్యావసరమైన సౌకర్యాలు లేకపోతే, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వుండరాదు.