జున్ను తింటే లాభాలు వున్నాయి, నష్టాలు కూడా వున్నాయా?

జున్ను. ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. జున్ను తింటే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మోతాదుకి మించి తింటే అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.

తల్లిపాలు సరిగాపడని బాలింతలు జున్ను తింటే తల్లిపాలు వృద్ధి చెందుతాయి.

జున్నులోని విటమిన్ బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి.

జున్ను తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపవుతుంది.

జున్ను మరీ ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీయవచ్చు.

మితిమీరి జున్ను తింటే అది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.