నడుస్తుంటే తూలిపోతున్నట్లు, తల తిరగడం, ఐతే అది వెర్టిగో కావచ్చు, లక్షణాలేమిటి?

చాలా అరుదుగా కనిపించే అనారోగ్య సమస్య వెర్టిగో. వెర్టిగో సాధారణంగా లోపలి చెవిలో బ్యాలెన్స్ పనిచేసే విధానంలో సమస్య వల్ల వస్తుంది. అయినప్పటికీ ఇది మెదడులోని కొన్ని భాగాలలో సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు. వెర్టిగో లక్షణాలేమిటో, ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాము.

credit: twitter

వెర్టిగో వల్ల మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పి రావచ్చు.

తల గిర్రున తిరగడం, కూర్చుని వున్నప్పటికీ కదులుతున్నట్లు అనిపిస్తుంది.

కళ్లతో నేరుగా చూడటంలో సమస్యలు ఎదురవుతాయి.

ఒక చెవిలో వినికిడి లోపం కనిపిస్తుంది. సరిగా నిలబడలేని బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతాయి.

చెవుల్లో ఏదో మోగుతున్నట్లనిపిస్తుంది, చెమటలు పడుతుంటాయి.

కొన్నిసార్లు వికారం లేదా వాంతులు అవ్వవచ్చు.

హైడ్రేటెడ్‌గా వుంటూ రోజూ తగినంత ద్రవాలు త్రాగుతుండాలి.

తగినంత నిద్రపోవాలి, ఎందుకంటే నిద్రలేమి కూడా వెర్టిగోకి కారణం కావచ్చు.

పౌష్టికాహారం తీసుకోవాలి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి.

ధ్యానం, తేలికపాటి వ్యాయామం చేస్తుండాలి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించాలి.