కొత్తిమీర మంచిదే కానీ అలా తీసుకుంటే చెడ్డది

కొత్తిమీర. ఇది రుచిగా, సువాసనగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఐతే కొత్తిమీరను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

కొత్తిమీరను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల చర్మం వాపు, పెదవుల నొప్పి వంటి అలెర్జీలను కలిగించవచ్చు.

కొత్తిమీర ఎక్కువగా తీసుకుంటే వికారం, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు.

మధుమేహం ఉన్నవారు కొత్తిమీరను మితంగా తీసుకోవాలి.

కొత్తిమీరలో పొటాషియం ఎక్కువగా వుంటుంది కనుక దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

కొత్తిమీర కొన్నిసార్లు శరీరంలోని కొన్ని ముఖ్యమైన పోషకాలకు ఆటంకం కలిగిస్తుంది.

కొత్తిమీరను దీర్ఘకాలం లేదా అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు వస్తాయి

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.