ఆవు పాలు లేదా గేదె పాలు, రెండిట్లో ఏవి తాగితే మంచిది?
ఆవు పాలు, గేదె పాలు రెండింట్లో కూడా కొన్ని లాభాలు, నష్టాలూ కూడా ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram
ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
ఆవు పాలలో 90 శాతం నీళ్లు ఉంటాయి. ఇది డిహైడ్రేషన్‌కి గురవకుండా ఉంచుతుంది, గేదె పాలలో అలా కుదరదు.
ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి.
ప్రోటీన్ ఎక్కువగా గేదె పాలలో ఉండటం వల్ల పెద్దవాళ్ళకి ఎంపిక చేయడం మంచిది కాదు.
గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.
ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటే కప్పు ఆవు పాలలో 148 కేలరీలు ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి.