వేసవిలో కీరదోస తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

కీరదోస. ఇవి నీటితో నిండి వుండి వేసవి తాపాన్ని తీర్చుతాయి. అంతేకాదు, వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఇంకా ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి.

కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.

కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది.

కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి.

కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.

చక్కెర, పిండిపదార్థాలు, క్యాలరీలు తక్కువగా వుండటం వల్ల వీటిని తిన్నప్పటికీ బరువు అదుపులోనే వుంటుంది.

కీరదోసలో వుండే సీయూబీ రక్తనాళాల్లో కొవ్వు పూడికలు లేకుండా చేయడంతో గుండెకి ఇది ఎంతో మేలు చేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్యనిపుణుడిని సంప్రదించాలి.