డార్క్ చాక్లెట్ గుండెకు ఎందుకు మంచిది?

డార్క్ చాక్లెట్ శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి పనిచేస్తుంది. ఈ చాక్లెట్ తింటే లాభాలేంటో తెలుసుకుందాం.

webdunia

డార్క్ చాక్లెట్ తెల్ల రక్త కణాలను రక్తనాళాల గోడలకు అంటుకోకుండా నిరోధిస్తుంది.

డార్క్ చాక్లెట్ ధమనులలో కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధిస్తుంది.

ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.

డార్క్ చాక్లెట్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గించగలదని తేలింది.

డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఒక రోజులో 30-40 గ్రాముల కంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ తీసుకోవద్దు.

నిరాకరణ: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.