బాస్మతి రైస్‌తో ఆహారం, దానితో ఆరోగ్య ప్రయోజనాలు

బాస్మతి బియ్యాన్ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాస్మతి బియ్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and pixabay

బాస్మతి బియ్యంలోని థయామిన్ కొన్ని మెదడు వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

తృణధాన్యాల బాస్మతి బియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. దీనితో బరువు పెరగరు.

బాస్మతి బియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణాశయానికి, బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గోధుమ బాస్మతి బియ్యం వంటి తృణధాన్యాలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

బాస్మతి తృణధాన్యాలు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి హృదయాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది.

డయాబెటిక్ వ్యాధిగ్రస్తులైతే, గోధుమ బాస్మతి బియ్యం మేలు చేస్తాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కనుక చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది.

బాస్మతి బియ్యంలో ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ రిస్క్ తగ్గించగల గుణం బాస్మతి బియ్యంలో వున్నాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.