ఈ పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఏంటవి?

పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి. అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు.

పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది.

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది.

పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.

నారింజ, నిమ్మకాయలు అధిక ఆమ్లతను కలిగి ఉంటాయి కాబట్టి, వాటిని తిన్న వెంటనే నీరు త్రాగటం ఛాతీలో చికాకు కలిగిస్తుంది.

యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్ట మందగిస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది, పూర్తి సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించాలి.