నిమ్మకాయ గింజలు. నిమ్మ చేసే మేలు ఎంతో వుంది. నిమ్మరసం తాగితే శరీరానికి తక్షణం శక్తి వస్తుంది. నిమ్మ గింజలు తీసుకుంటే శరీరానికి అందే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
నిమ్మకాయ గింజల్లో వుండే యాంటీఆక్సిడెంట్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకుంటుంది.
స్కిన్ హెల్త్ ఇమ్యూనిటీ బూస్టర్‌ను నిర్వహించడానికి నిమ్మ గింజల్లో వున్న విటమిన్ సి దోహదం చేస్తుంది.
నిమ్మకాయ గింజల నూనెకి నొప్పిని నియంత్రించే శక్తి వుంది. అందుకే చెవిపోటు తదితర సమస్యలకు నిమ్మనూనె ఉపయోగిస్తారు.
నిమ్మకాయ గింజల పదార్థాలు కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగల్, పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణగా ఉంటుంది.
లెమన్ సీడ్ ఆయిల్ విద్యార్థుల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించబడుతుంది.
మూడు నిమ్మకాయ గింజల్ని ఎండబెట్టి చూర్ణం చేసి నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు.
గమనిక: ఈ చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.