గోరింటాకులో ఔషధ గుణాలు, ఏంటో తెలుసా?

గోరింటాకు. ఈ ఆకును పండుగ సందర్భాల్లో స్త్రీలు చేతులకు, కాళ్లకు పెట్టుకుంటుంటారు. ఐతే గోరింటాకులో ఔషధగుణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

అరికాళ్లు మంటపెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్ళకు మందంగా రాస్తే అరికాళ్ళమంట తగ్గుతుంది.

సెగగడ్డలు వచ్చి ఎంతకూ పగలకుండా ఉన్నప్పుడు గోరింటాకు మెత్తగా నూరి సెగ గడ్డలపైన వేస్తే నొప్పి తగ్గుతుంది.

కీళ్ళు నొప్పులుంటే గోరింటాకుల్ని నూరి కీళ్ళకు పట్టువేస్తే తగ్గుతాయి

తలకు గోరింటాకు రసాన్ని మర్దనా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం రాస్తుంటే చుండ్రు పోతుంది.

గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి.

గోరింటాకు విత్తనాలు విరేచనాలు ముఖ్యంగా నీళ్ళ విరేచనాలను అరికడతాయి.

తెల్ల వెంట్రుకలు వున్నవారు గోరింటాకును మెత్తగా నూరి రాత్రంతా పాత్రలో నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించి తరువాత తలస్నానం చేయాలి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.