ప్రతి ఆహారం లేదా పానీయం కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందుకు గ్రీన్ టీ భిన్నమైనది ఏమీ కాదు. గ్రీన్ టీ ప్రయోజనకరమైన ఫలితాలతో పాటు దుష్ప్రభావాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
webdunia
గ్రీన్ టీ రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల లోపు సురక్షితం.
రోజుకు 3-4 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉండవచ్చు.
నిమ్మరసం, తులసి టీ, అల్లం టీ, దాల్చిన చెక్క టీలు గ్రీన్ టీకి అద్భుతమైన ప్రత్యామ్నాయాలు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే పలు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.
గ్రీన్ టీ అధికంగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తర్వాత కూడా హాని కలుగువచ్చు.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.