మొలకెత్తిన గింజలు ఎందుకు తినాలో తెలుసా?

మొలకెత్తిన గింజలు. ఈ రోజుల్లో వీటిని తినేవారు క్రమంగా పెరుగుతున్నారు. కారణం వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత ఆ గింజలులో చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. మొలకలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

మొలకల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జుట్టు, చర్మం, గోళ్లు పెరగడానికి సహాయపడుతాయి.

మొలకలలో వుండే ఆల్కైజెస్‌ ప్రాణాంతక‌ వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించగలవు.

మొలకలు తింటే మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్‌ను శరీరావయవాలకు అందిస్తాయి.

సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 సార్లు అసలు విలువలను పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.

మొలకల్లో ఫైబర్ కంటెంట్ అధికం కనుక శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.

మొలకెత్తిన గింజలు హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.