మునగ ఆకులలో ఎన్ని పోషకాలు వున్నాయో తెలుసా?

మునగాకు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు మునగ పూలు, మునగ కాయలు ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. మునగాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

మునగాకు రసం నేత్ర రోగాలను, వాత, పైత్య దోషాలను, విషాలను హరిస్తుంది.

మునగాకు సూప్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ వారానికి ఒకట్రెండు సార్లు కంటే మించి తాగరాదు.

లేత మునగ ఆకు కూర వండుకుని తింటుంటే పురుషులకు శక్తినిస్తుంది.

మునగ కాయలు, ఆకులు కూరగా చేసుకుని తింటే స్త్రీలకు శరీరంలో చెడునీరు తొలగుతుంది.

మునగాకు, వసకొమ్ము, వాము సమంగా కలిపి దంచి నూనెలో ఉడకబెట్టి గాయాలకు, దెబ్బలకు కడితే మానుతాయి.

మునగ ఆకులు కూరను తింటుంటే కాలేయ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

మునగ ఆకులను ఆహార పదార్థాల్లో భాగంగా చేసుకుని తింటుంటే అది పలు రకాలైన కేన్సర్లను సైతం అడ్డుకుంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.