కోడి గుడ్లు తిని, పాలు సేవిస్తుంటే ప్రయోజనాలు ఏమిటి?

శరీరం బలంగా, అవసరమైనంత శక్తి చేకూరాలంటే కోడిగుడ్లు తింటూ, పాలు తాగాలని చెబుతుంటారు వైద్యులు. ఈ గుడ్లు, పాలు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

కోడిగుడ్లు, పాలు రెండూ ప్రోటీన్ యొక్క మంచి మూలాలు, ఇవి కండరాలు, కణజాలం నిర్మాణానికి మేలు చేస్తాయి.

గుడ్లు, పాలు రెండూ కాల్షియం వనరులు కనుక ఎముక పుష్టికి దోహదపడతాయి.

కోడిగుడ్లు లోని కోలిన్ మెదడు పనితీరు, కణ త్వచం ఏర్పడటానికి ముఖ్యమైన పోషకం.

కోడిగుడ్లులో వుండే ఫోలేట్ పిండం అభివృద్ధికి సహాయపడుతుంది.

గుడ్లు లోని విటమిన్ డి కండరాల ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడుతుంది.

కోడిగుడ్లు లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కండరాల ఆరోగ్యం, పెరుగుదలకు తోడ్పడతాయి.

కోడి గుడ్లు, పాలు రెండింటీలోనూ ఐరన్ ఉంటుంది కనుక వీటిని తీసుకుంటుండాలి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.