రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచే ఆహారాలు

దేశవ్యాప్తంగా కోవిడ్, ఫ్లూ కేసులు పెరుగుతున్న వేళ, మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ ఇన్ఫెక్షన్ల సమయంలో మీ శరీరంను ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవటానికి మీ సాధారణ ఆహారంలో చేర్చుకోవాల్సిన, రోగనిరోధక శక్తిని పెంచే సూపర్‌ఫుడ్‌లు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

కాలిఫోర్నియా బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటి 15 ముఖ్యమైన పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

credit: social media and webdunia

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పసుపు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను ఎదుర్కుంటుంది.

credit: social media and webdunia

అల్లం జీర్ణక్రియకు మేలు చేయడమే కాక శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది సాధారణ జలుబు, గొంతు నొప్పిని ఎదుర్కొంటుంది.

credit: social media and webdunia

వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

credit: social media and webdunia

నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి కీలకమైనవి

credit: social media and webdunia

విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉన్న బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

credit: social media and webdunia

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

credit: social media and webdunia