శరీరానికి శక్తిసామర్థ్యాలను కల్పించే ఆహార పదార్థాలు
శరీరానికి శక్తి చేకూరాలంటే పూర్తి పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి. ప్రత్యేకించి కొన్ని పదార్థాలు తింటుంటే శరీరం శక్తిసామర్థ్యాలను సంతరించుకుంటుంది. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media
బ్రౌన్ రైస్ పిండి పదార్ధాలకు గొప్ప మూలం, ఇందులో ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
కోడిగుడ్లు కండరాలు, శరీర కణజాలాల పెరుగుదల, మరమ్మత్తుకు అవసరమైన పోషకం, శక్తిని పెంపొందించడానికి ప్రోటీన్లు అందిస్తాయి.
చేపలు తింటుంటే వాటిలో వుండే ఒమేగా యాసిడ్ మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
పుల్లపుల్లని పండ్లైన నిమ్మ, బత్తాయి, ఉసిరి వంటివి తింటుంటే జలుబు, దగ్గు వంటివి దరిచేరవు.
అరటిపండ్లలో పొటాషియం, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వున్నాయి. ఇవి శరీర శక్తిని పెంచుతాయి.
శరీరంలో ఇనుము లోపిస్తే స్టామినా తగ్గుతుంది కనుక పచ్చని ఆకుకూరలు తింటుండాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.