బాదంపప్పుతో గుండె పదిలం!

మనకు అందుబాటులో ఉండే డ్రైఫ్రూట్లలో బాదంపప్పు ఒకటి. ఈ పప్పు ఆరోగ్యానికి ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు చేస్తుంది. ముఖ్యంగా మనిషి శరీరంలోని అత్యంత ప్రధానమైన గుండెను సురక్షితంగా పరిరక్షిస్తుంది. ఈ బాదం పప్పుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇపుడు తెలుసుకుందాం...

webdunia

బాదంపప్పును తినడానికి సరైన మార్గం వాటిని పొట్టు తీసి తినడమే.

ఎండిన బాదంపప్పుల కంటే నానబెట్టిన బాదంపప్పులను ఆరగించడం ఎంతో మంచిది.

నానబెట్టిన బాదం జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తుంది.

బాదంపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ బాదం ఆకలిని అరికడుతుంది, బరువును నియంత్రణలో ఉంచుతుంది.

నానబెట్టిన బాదం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

నానబెట్టిన బాదం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

బాదంపప్పులో విటమిన్ బి17, ఫోలిక్ యాసిడ్ ఉండటంతో కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

డాక్టర్ సలహాపై ఆరోగ్య చిట్కాలను ప్రయత్నించండి.