నల్ల మిరియాలు ఆరోగ్య ప్రయోజనాలు

మిరియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటి వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

గ్లాసు నీటిలో చుక్క ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ వేసుకుని ఉదయాన్నే అల్పాహానికి ముందు తాగితే బరువు తగ్గవచ్చు.

నల్ల మిరియాలు ఆహారంలో కాస్తంత తీసుకుంటుంటే అవి క్యాలరీలు బర్న్ చేసి కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయి.

నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి.

ఉదయాన్నే రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే శరీరంలోని మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది.

సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

వెజిటేబుల్ సలాడ్స్‌పైన నల్ల మిరియాల పొడిని చల్లి తింటే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

మిరియాల పొడిని టీలో వేసుకుని తాగుతుంటే గొంతులో గరగర తగ్గుతుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.