చేపలు తినేవారికి కలిగే ప్రయోజనాలు ఎన్నో

చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చెప్తారు. చేపలు తింటుంటే పొట్ట, రక్తపోటు పెరగకుండా చేస్తాయి. చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు చేపలు దోహదం చేస్తాయి.

చేపలు తరచుగా తినేవారికి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పు తగ్గుతున్నట్టు తేలింది.

చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ప్రయోజనాలు కలుగుతున్నాయని భావిస్తున్నారు.

చేపలు తినేవారిలో మెదడు ఆరోగ్యం పెంపొందుతుంది.

మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి రుగ్మతలు చేపలు తింటుంటే దూరమవుతాయి.

చేపల్లో విటమిన్ డి వుంటుంది కనుక దాని సంబంధిత అనారోగ్యాన్ని దరిచేరనీయదు.

ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదాన్ని చేపలు తినడం ద్వారా తగ్గించవచ్చు

చిన్నారుల్లో ఆస్తమా సమస్యను ఎదుర్కోవాలంటే చేపలు తినిపించాలి.