రెండంటే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిని చూడండి
వెల్లుల్లి. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా ఆ సమస్యను తగ్గించే గుణం వెల్లుల్లికి ఉంది. పరగడుపున వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
webdunia
దగ్గుతో బాధపడేవారు వెల్లుల్లిని దంచి దానికి కొంచెం తేనే కలిపి రెండు గంటలకోసారి తింటే ఉపశమనం పొందవచ్చు.
రక్త ప్రసరణ బాగా జరగడానికి, కొవ్వుని తొలగించడానికి వెల్లుల్లి దోహదపడుతుంది.
హృదయ సంబంధిత రోగాలతో బాధపడేవారు ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం మంచిది.
అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే సమస్య అదుపులో ఉంటుంది.
వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.