అందం, ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ ఎలా ఉపయోగపడుతుంది?

ఆలివ్ ఆయిల్. పచ్చి ఆలివ్ నూనె చాలా ఆరోగ్యకరమైనది. దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా గుండె, మెదడు, కీళ్ళు తదితర అవయవాలకు మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం కాంతివంతంగా మారుతుంది.

ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ముఖ చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది.

ఆలివ్ ఆయిల్ గుండె ధమనుల పనితీరుకు అడ్డంకిగా మారే కొవ్వును తొలగించి రక్తప్రసరణలను మరింతగా పెంచుతుంది.

ఆలివ్ ఆయిల్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందింపజేస్తాయి.

ఆలివ్‌ ఆయిల్‌ను వేడి చేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలిపోకుండా వుంటుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.