poppy seeds uses గసగసాలు చేసే మేలు ఏమిటి?

poppy seeds గసగసాలు. మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. గసగసాలను కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది. గసగసాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

గుండె సమస్య ఉన్న వారు గసగసాలు దోరగా వేయించి పంచదార కలిపి ఉదయం, సాయంత్రం అర చెంచాడు తీసుకుంటే గుండెకు మంచిది.

కడుపులో మంట ఉన్న వారు ఎసిడిటీ వున్న వారు దీనిని వాడితే పేగులలోని పుండు కూడా తగ్గుతుంది.

గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి వుంటాయి. తరచు వేడి చేసేవారు వీటిని వాడటం వలన వేడి తగ్గుతుంది.

విరేచనాలు అవుతున్నప్పుడు గసగసాలను దోరగా వేయించి నీటితో కలిపి నూరి ఆ రసాన్ని తేనెతో గాని లేక పంచదారతో కాని తీసుకోవాలి.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వలన మంచి నిద్ర సొంతం అవుతుంది.

గసగసాలుకి శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యం వుంది. దగ్గు, దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తాయి.

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళ ఏర్పాటును నివారించే శక్తిని గసగసాలు కలిగి ఉంటాయి.

గసగసాలు అతిగా వాడటం వలన మగవారిలో వీర్య నష్టము జరుగుతుంది. కాబట్టి వీటిని అతిగా వాడకూడదు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.