పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా పొద్దుతిరుగుడు నూనెను పొద్దుతిరుగుడు విత్తనాల నుండి సేకరించే నూనె. ఇది ట్రైగ్లిజరైడ్, ప్రధానంగా పాల్మిటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. దాని పోషక విలువలు, ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు అద్భుతమైనవి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, బ్లడ్ లిపిడ్‌లు వంటివి ఇందులో వుండటం వల్ల గుండెకి ఎంతో మంచిది.

యాంటీఆక్సిడెంట్ చర్యతో అద్భుతమైన ఫేస్ మాయిశ్చరైజర్‌గా పనిచేసే ఈ నూనెలో విటమిన్లు ఎ, డి, సి, ఇలు వున్నాయి.

సిఫార్సు చేసిన మోతాదులో ఈ నూనెను ఉపయోగించినప్పుడు ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రతను తగ్గిస్తుంది.

సన్‌ఫ్లవర్ ఆయిల్ లోని విటమిన్ ఇ ఆస్తమాతో సంబంధం ఉన్న సమస్యలను తగ్గిస్తుందని చెపుతారు.

సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ పలు రకాల కేన్సర్లు రాకుండా అడ్డుకోగలవు.

సన్‌ఫ్లవర్ ఆయిల్ తగినంత లినోలెయిక్ ఆమ్లాన్ని అందిస్తుండటం వల్ల శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి చేకూరుతుంది.

బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలున్న సన్ ఫ్లవర్ ఆయిల్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

ఐతే ఈ నూనెను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసినప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతారు.

గమనిక: ఈ సమాాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.