వంకాయను ఉడకబెట్టి తేనెతో తాకించి తింటే?

వంకాయ. కూరగాయల్లో వంకాయ ప్రత్యేకం. ఈ కాయలతో చేసే వంటకాలు భలే టేస్టుగా వుంటాయి. అలాగే వీటిలో వుండే పోషకాలు కూడా అంతే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం వేళ తింటే మంచి నిద్ర వస్తుంది, నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి మందు.

వంకాయ సూప్, ఇంగువ, వెల్లుల్లితో తయారుచేసిన మిశ్రమాన్ని తీసుకుంటే కడుపుబ్బరము తగ్గుతుంది.

మధుమేహం ఉన్నవారు వంకాయతో చేసిన పదార్థాన్ని తింటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

వంకాయ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది కనుక గుండెసమస్యలను అడ్డుకుంటుంది.

వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము వంటి సమస్యలు తగ్గుతాయి.

వంకాయ రసము నుండి తయారు చేసిన ఆయింట్‌మెంట్లు, టించర్లు, మూలవ్యాధి నివారణలో వాడుతుంటారు.

వంకాయ కూరతో అధిక రక్తపోటు సమస్యను అదుపులో పెట్టవచ్చంటారు.

వంకాయలు ఆకలిని పుట్టిస్తాయి, వాతాన్ని తగ్గిస్తాయి, శుక్రాన్ని వృద్ధిచేస్తాయి.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.