వాతావరణ మార్పులు కారణంగా జలుబు, దగ్గు సమస్యలు వెంటనే ఒకరి నుంచి ఒకరికి ప్రబలుతాయి. కొందరిలో పొడి దగ్గు వేధిస్తుంటుంది. ఈ దగ్గు సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము.
credit: Instagram
అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే పొడి దగ్గు తగ్గుతుంది.
అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
జీలకర్ర, కలకండను నమిలి తింటే దగ్గు నయం అవుతుంది.
4 మిరియాలు, 5 దాల్చిన చెక్కల్ని నెయ్యిలో వేపి పొడి చేసి ఓ తమలపాకులో పెట్టి తింటే దగ్గును దూరం చేసుకోవచ్చు.