నోరు తెరిస్తే చాలు, భరించలేని దుర్వాసన, వదిలించుకునే మార్గాలివే

నోటి దుర్వాసన. ఈ సమస్యతో పలువురు ఇబ్బంది పడుతుంటారు. నలుగురు కలిసిన చోట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఐతే చిన్నచిన్న చిట్కాలతో నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

పుష్కలంగా నీరు తాగాలి. మంచినీరు నోటి లోపల క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది నోటి దుర్వాసనను అరికడుతుంది.

సోంపు తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది.

మంచి మౌత్ ఫ్రెషనర్‌లలో పుదీనా ముఖ్యమైనది కనుక దీన్ని తీసుకోవాలి.

లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

దాల్చిన చెక్క ముక్కలను నీటిలో వేసి మరిగించి మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు.

నోటి దుర్వాసన ఉంటే నోటిలో ఓ యాలుక్కాయ వేసుకుని చప్పరిస్తుంటే సరి.

నారింజ, నిమ్మకాయలు లాలాజల గ్రంధిని ప్రేరేపిస్తాయి కనుక వాటిని తీసుకోవాలి.

భోజనం తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.