మహిళలను ఇబ్బందిపెట్టే మెడ వద్ద నలుపు, పోగొట్టడం ఇలా

మహిళల్లో కొంతమంది మెడ వద్ద చర్మం నల్లగా మారుతుంది. ఇది మెడ వద్ద అందవిహీనంగా కనబడుతుంది. అలాంటి సమస్య వున్నవారు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

కలబందలోని ఫ్లేవనాయిడ్ అలోసిన్, చర్మం యొక్క వర్ణద్రవ్యం కలిగించే ఎంజైమ్ చర్యను నిరోధించడం ద్వారా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ శరీర పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది, ఇది శరీరానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని మృదువుగా, పునరుజ్జీవింపజేస్తుంది

బేకింగ్ సోడాతో ప్యాక్ మెడ పైనున్న నల్లని చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మేలు చేస్తుంది.

మెడపై నల్లటి చర్మాన్ని తెల్లగా మార్చేందుకు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి రాయాలి.

బంగాళదుంప రసంలోని బ్లీచింగ్ గుణాలున్నాయి. ఈ రసం మెడపై చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

పసుపుకున్న వైద్య లక్షణాలతో దెబ్బతిన్న కణాలను పునరుజ్జీవింపజేసి చర్మపు రంగును ప్రకాశవంతం చేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.