Dry cough remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

పొడి దగ్గు. ఈ సమస్య చాలా ఇబ్బందికరమైనది. ఇది సాధారణ జలుబు, ఫ్లూ, అలెర్జీల వల్ల వచ్చే సాధారణ లక్షణం. ఈ దగ్గును తగ్గించడానికి కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media, Freepik and webdunia

వేడి నీరు, తేనె కలిపిన నీరు, అల్లం టీ వంటి వేడి ద్రవాలు గొంతును తేమగా ఉంచి దగ్గును తగ్గిస్తాయి.

వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పడితే పొడి దగ్గును వదిలించుకోవచ్చు.

తేనెను కాస్తంత సేవించినా అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతు సమస్యకి ఉపశమనం కలిగిస్తుంది.

తులసి ఆకులు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండి గొంతు వాపును తగ్గిస్తుంది.

వేడి సూప్స్ తాగుతుంటే గొంతును తేమగా ఉంచి దగ్గును తగ్గిస్తాయి

ఇంకా తగినంత నిద్ర, ధూమపానం నిషిద్ధం, పరిసరాల శుభ్రత పాటించాలి.

గమనిక: పొడి దగ్గు ఎక్కువ రోజులు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.