పండుగల సమయంలో ఋతుక్రమాన్ని వాయిదా వేయాలి, ఎలా?

కొన్ని కారణాల వల్ల స్త్రీలు తమ ఋతుక్రమాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలని అనుకుంటారు. పీరియడ్స్ కాస్త బ్రేక్ వేయాలంటే సహజసిద్ధమైన పద్ధతుల్లో వెళ్తే మంచిది. అవేంటో చూద్దాము.

credit: social media and webdunia

స్పైసీ ఫుడ్- మిరపకాయ, నల్ల మిరియాలు, వెల్లుల్లి వంటివి దూరం పెట్టాలి. స్పైసీ ఫుడ్ తింటే రక్త ప్రసరణ పెరిగి ఋతుస్రావం అవకాశాలను పెంచుతుంది.

ఆవాలు- ఒక కప్పు గోరువెచ్చని పాలలో రెండు టీస్పూన్ల ఆవాల పొడిని కలిపి రుతుక్రమం వచ్చేముందు వారంలో ఒకసారి మాత్రమే త్రాగాలి.

వెనిగర్ - ఒక గ్లాసు నీటిలో 3 నుండి 4 టీస్పూన్ల వెనిగర్ వేసి, రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఋతుస్రావం ఆలస్యం అవుతుంది.

నిమ్మకాయ - దీనిని తీసుకోవడం వల్ల మీకు పీరియడ్స్ ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.

రైస్ వాటర్- నిమ్మరసం కలిపిన రైస్ వాటర్ తాగవచ్చు. ఈ నీటిని రోజుకు 3 సార్లు త్రాగాలి

పుదీనా- దోసకాయ రసంలో పుదీనా కలిపి తాగవచ్చు. దీంతో రుతుక్రమం ఆలస్యం అవుతుంది.

వ్యాయామం- రుతుక్రమం సక్రమంగా జరగేందుకు వ్యాయామం చేస్తారు. కనుక వ్యాయామానికి కాస్త విరామం ఇస్తే రుతుక్రమం ఆలస్యం కావచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.